Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీలో ఉద్యోగుల గొంతుకగా పోరాడ‌తాం: హరీశ్‌ రావు

కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేడ్క‌ర్ చౌరస్తాలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్వ‌హించిన‌ నిరహార దీక్షలో హ‌రీశ్ రావు పాల్గొన్నారు. 35 ఏండ్లు కష్టపడి పని చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను (Retired Employees) రోడ్ల మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి (Revant Reddy)కే దక్కిందని విమర్శించారు. ఉద్యోగుల దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.

ఎన్నికల ముందు పెండింగ్ డీఏలు ఇస్తామని హామీలు ఇచ్చి మర్చిపోయారని, ఉద్యోగుల దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని హరీశ్ అన్నారు. ఉద్యోగులు సంఘటిత‌మై ప్రభుత్వంపై పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నార‌ని, అందులో రూ.10 వేల కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల కోసం పెట్టాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కమీషన్ ఇచ్చే వారికి డబ్బులు ఇస్తారు కానీ, కమీషన్ ఇవ్వని ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరని ఆరోపించారు. పెన్షన్ బెనిఫిట్ రాక 60 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని, వారి చావుకు కారణం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేసి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>