కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ (Arijit Singh) ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు అర్జిత్ కెరీర్, సంపాదన, లైఫ్ స్టైల్‌పై ఆసక్తి చూపారు. నివేదికల ప్రకారం.. అరిజిత్ సింగ్ దాదాపు రూ.414 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అతని ఏడాది ఆదాయం రూ. 70 కోట్లదాకా ఉంటుంది. సినిమా పాటలు, ప్రత్యక్ష కచేరీలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల భారీగా సంపాదిస్తున్నాడు. అర్జిత్ ఒక్కో సినిమా పాటకు 8 లక్షల నుండి 10 లక్షల వరకు తీసుకుంటాడని బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి.
ఒక్కో ప్రత్యక్ష ప్రదర్శనకు దాదాపు రూ. 2 కోట్లు వసూలు చేస్తాడు. కేవలం రెండు గంటల కచేరీకి అర్జిత్ (Arijit Singh) దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడు. ఆయన పూణే (Pune)లో ఓ కచేరీ నిర్వహించగా, ప్రీమియం లాంజ్ టిక్కెట్ల ధర రూ.16 లక్షలు ఉన్నాయంటే అర్జిత్ రేంజ్ తెలియజేస్తోంది. 2025 సెప్టెంబర్‌లో లండన్‌లోని సోలో కచేరి నిర్వహించిన మొదటి ఇండియన్ సింగర్‌గా చరిత్రకెక్కాడు. మ్యూజిక్‌ను మించి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా అర్జిత్ సింగ్ భారీ ఆదాయం పొందుతున్నాడు.
Read Also: వెంకీ, తరుణ్ భాస్కర్ మూవీ అసలు నిజం ఇదే..
Follow Us On: X(Twitter)


