Mobile Popup Ad
Mobile Popup Ad

ఎయిరిండియాలో భారీ కుంభకోణం.. 4వేల మందిపై చర్యలు

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రముఖ విమాన సంస్థ ఎయిర్ ఇండియాలో (Air India) భారీ కుంభకోణం బయటపడింది. ఈ సంస్థ అందించే ఫ్రీ టికెట్లను సిబ్బంది డబ్బులకు అమ్ముకున్నట్టు తేలింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 4వేల మంది ఈ కుంభకోణంలో ఉన్నారు. దీంతో వారందరిపై చర్యలకు రెడీ అవుతోంది సంస్థ. దీంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఏంటీ కుంభకోణం..?

టాటా గ్రూప్ సంస్థ.. ఎయిర్ ఇండియా (Air India) సిబ్బందికి ఏడాదికి 14 ఫ్రీ ఫ్లైట్ టికెట్లను అందజేస్తోంది. ఈ టికెట్లను సదరు సిబ్బంది లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ 4వేల మంది సిబ్బంది ఈ టికెట్లను తమ ఇంట్లో వారికి కాకుండా బయటి వారికి అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. కొంత మంది తమ బంధువుల పేరు చెప్పి.. వేరే వాళ్లకు ఇచ్చేశారు. ఇలా ఉద్యోగులు ఉచిత టికెట్లను అమ్ముకోవడంపై సంస్థ సీరియస్ అయింది. ఎయిర్ ఇండియాలో మొత్తం 24వేల మంది సిబ్బంది ఉన్నారు. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొన్న తర్వాత జాయిన్ అయిన వారే ఈ కుంభకోణంలో ఉన్నారని సంస్థ గుర్తించింది. కాబట్టి ఈ అమ్ముకున్న టికెట్ల సొమ్మును సిబ్బంది జీతాల్లో నుంచి కట్ చేయడంతో పాటు కొందరిపై చట్టపరమైన చర్యలకు సంస్థ రెడీ అయినట్టు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>