కలం, వెబ్ డెస్క్ : గ్యాంగ్‌స్టర్ నయీం (Gangster Nayeem) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పది మందిపై అభియోగాలు నమోదు చేస్తూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నయీంకు చెందిన 91 స్థిరాస్తులను గుర్తించిన అధికారులు, వాటిని ఫ్రీజ్ చేశారు.
నయీం బతికున్న సమయంలో సామాన్యులను భయబ్రాంతులకు గురిచేసి, బలవంతంగా పలు ఆస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కేవలం తన పేరిట మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు ఈడీ నిర్ధారించింది. కొన్నేళ్ల క్రితం పోలీసు కాల్పుల్లో నయీం మరణించిన విషయం తెలిసిందే.
Read Also: మున్సి‘పోల్స్’లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి పోటీ
Follow Us On: Pinterest


