కలం, సినిమా : టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhascker), విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది. వీరి కాంబోలో మూవీ గురించి అప్పట్లో న్యూస్ బాగా వైరల్ అయింది. కానీ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. ఈ కాంబినేషన్ లో మూవీ ఇక లేనట్టేనా అంటే అలాంటిది ఏమీ లేదు.. ఖచ్చితంగా మా కాంబినేషన్ లో మూవీ ఉంటుందని తరుణ్ భాస్కర్ చెబుతున్నారు. మూవీ ఆలస్యానికి కారణం ఏమిటో తరుణ్ తెలిపారు.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్ లు అందుకున్న తరుణ్ భాస్కర్.. విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాలు కష్టపడి కథ రెడీ చేశాడు. కానీ సినిమా సెట్స్ పైకి రాకపోవడంతో.. ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టే అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే తరుణ్ భాస్కర్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉంటుందని, తను రాసిన స్క్రిప్ట్ తో సినిమా చేయడానికి ఇదే రైట్ టైమ్ అని తెలిపారు.
అప్పట్లో తను రాసిన స్క్రిప్ట్ ఫస్టాఫ్ బాగుంది కానీ.. సెకండాఫ్ తనకే నచ్చలేదని తరుణ్ భాస్కర్ అన్నారు. వెంకటేశ్, సురేష్ బాబు ఇద్దరికీ ఓ వెర్షెన్ నచ్చింది. కానీ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కే ఇంకా బెటర్ గా రాయచ్చు అనిపించిందట. అందుకనే ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యిందని తెలిపారు. వెంకటేశ్ గారు సిద్దంగానే ఉన్నారు కానీ తనే కథను పూర్తి చేయడంలో టైమ్ తీసుకున్నానని తరుణ్ చెప్పుకొచ్చారు.


