కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అక్రమం కాదంటున్న కేటీఆర్, కవిత ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) డిమాండ్ చేశారు. ఇటీవల కవిత మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కవిత( Kavitha) నేరుగా మీడియా ముందే తన ఫోన్ ట్యాప్ చేశారని అద్దంకి వెల్లడించారు.
హరీశ్ రావు బొగ్గు స్కాం (Coal Scam) ఆరోపణలు చేయడంపై అద్దంకి తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో అక్రమాలు జరిగితే బీఆర్ఎస్ వాళ్లకు ఎందుకు టెండర్లు దక్కుతాయని ప్రశ్నించారు. ప్రతిమ కంపెనీ ఎవరిదని, వినోద్ రావు, ఉపేందర్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. నాలుగు బ్లాక్‌లు బీఆర్ఎస్ వాళ్లకే వచ్చాయని తెలిపారు. కిషన్ రెడ్డి సుప్రీం కోర్టు చెప్పిన విషయం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఎలా అయ్యాడోనని ఎద్దేవా చేశారు. మరోవైపు జిల్లాల మార్పులపై వెళ్లిన ప్రతి చోటా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యవహారాలు చూసే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని దయాకర్ (Addanki Dayakar) అన్నారు.
Read Also: రిటైర్ అయినా వదిలిపెట్టం.. పోలీస్ ఆఫీసర్లకు హరీశ్ వార్నింగ్
Follow Us On: Instagram


