epaper
Friday, January 23, 2026
spot_img
epaper

అనిల్ రావిపూడి.. ఊహించని హీరోతో ఫిక్స్ అయ్యాడా..?

కలం, సినిమా : హిట్ మిషన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తరువాత సినిమా ఏంటి అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. వెంకీ, బాలయ్య, పవన్ కల్యాణ్, నాగార్జున తదితరలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ.. ఊహించని హీరోతో సినిమా ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. ఎవరా ఊహించని హీరో అని  నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు.

అనిల్ రావిపూడి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 సినిమాలతో హిట్ కొట్టాడు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. దీంతో అనిల్ రావిపూడి 10వ సినిమా ఎవరితో ఉండబోతుంది  అనేది ఆసక్తిగా మారింది. నలుగురు సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో  అనిల్ రావిపూడి సినిమాలు చేశాడు. కానీ.. నాగార్జునతో చేయలేదు. అందుచేత నాగార్జునతో సినిమా చేస్తే అరుదైన రికార్డ్ తన సొంతం అవుతుందని ఇటీవల అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. దీంతో నాగార్జునతో అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయిందని అంతా అనుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం  అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) తో అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఈ క్రేజీ కాంబోలో మూవీని సాహు గారపాటి నిర్మించనున్నారని సమాచారం. 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది అనిల్ రావిపూడి  ప్లాన్. అఖిల్‌కి ఇంత వరకు బ్లాక్‌బస్టర్ హిట్ పడలేదు. ప్రస్తుతం అఖిల్  లెనిన్ (Lenin) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా  ట్రెండింగ్ అయింది. దీంతో ఆ  సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. మే 1న లెనిన్ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో అఖిల్ సినిమా మొదలు పెట్టనున్నాడని సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>