Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష

కలం, జనగామ : జనగామలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జనగామ (Jangaon) పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు జనగామ ADM కోర్టు జరిమానాతో పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. కోర్టు న్యాయమూర్తి బుధవారం 16 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై తీర్పు ఇచ్చారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 15 మందికి ఒక్కొక్కరికి రూ.10 పది వేల చొప్పున మొత్తం లక్షా యాభై వేలు జరిమానా విధించారు.

ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ధర్మాసనం. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని పోలీసులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read Also: తక్కువ ధరలో ఎలెక్ట్రిక్ కార్ కావాలా? అయితే కామెట్ EV పై ఓ లుక్కేయండి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>