కలం, వెబ్ డెస్క్: త్వరలో దేశవ్యాప్తంగా ‘జనగణన–2027’ (Census 2027) నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. జనగణనలో భాగంగా కులగణన కూడా చేయబోతున్నారు. ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి ఎటుంటి ప్రశ్నలు అడగాలో సూచిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెన్సస్ చట్టం–1948లోని సెక్షన్ 8(1) కింద ఉన్న అధికారాలను అనుసరించి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ప్రతి అధికారి తనకు కేటాయించిన పరిధిలోని ప్రతి కుటుంబం నుంచి క్రింది అంశాలపై సమాచారం సేకరించాల్సి ఉంటుంది. మొత్తం 33 రకాలైన ప్రశ్నలను అడగబోతున్నారు.
Census 2027 – ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలివే..
1. భవనం సంఖ్య (మున్సిపల్/స్థానిక సంస్థ లేదా సెన్సస్ నంబర్)
2. ఇంటి నంబర్ ఎంత?
3. ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన ప్రధాన పదార్థం ఏమిటి?
4. గోడల నిర్మాణానికి ఉపయోగించిన ప్రధాన పదార్థం..
5. పై కప్పు ఎలా నిర్మించారు? పెంకుటిల్లు, దాబా ఇల్లు (ఏ రకం)
6. ఇంటి వినియోగ స్వరూపం (నివాసం/వాణిజ్యం మొదలైనవి)
7. ఇంటి పరిస్థితి ఏమిటి?
8. ఇంట్లో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి?
9. మొత్తం కుటుంబసభ్యుల సంఖ్య ఎంత?
10. కుటుంబ పెద్ద పేరు
11. కుటుంబ పెద్ద లింగం (పురుషుడా, స్త్రీ)
12. కుటుంబ పెద్ద ఎస్సీ/ఎస్టీ/ఇతర వర్గాలకు చెందినవారా? అనే వివరాలు
13. ఇంటి యాజమాన్య స్థితి
14. ఇంట్లో ఉన్న మొత్తం గదుల సంఖ్య
15. కుటుంబంలో వివాహితులైన జంటల సంఖ్య
16. తాగునీటికి ప్రధాన వనరు ఏమిటి?
17. తాగునీటి వనరు లభ్యత ఉందా?
18. విద్యుత్ సౌకర్యం ఉందా? సోలార్ వాడుతున్నారా?
19. మరుగుదొడ్డి సౌకర్యం ఉందా?
20. మరుగుదొడ్డి రకం
21. ఇంటి నుంచి వ్యర్థ్యాలను ఎక్కడికి వదులుతున్నారు? (డ్రైనేజ్)
22. స్నానాల గది ఉందా?
23. వంటగది, ఎల్‌పీజీ/పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నాయా?
24. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం
25. రేడియో/ట్రాన్సిస్టర్ ఉన్నాయా?
26. టెలివిజన్ ఉందా?
27. ఇంటర్నెట్ సౌకర్యం ఉందా?
28. ల్యాప్‌టాప్/కంప్యూటర్ ఉందా?
29. టెలిఫోన్/మొబైల్ ఫోన్/స్మార్ట్‌ఫోన్ ఉన్నాయా?
30. సైకిల్/స్కూటర్/మోటార్‌సైకిల్/మోపెడ్ ఉన్నాయా?
31. కారు/జీప్/వ్యాన్ ఉన్నాయా?
32. కుటుంబ సభ్యులు ఆహారం కోసం వినియోగించే ధాన్యం ఏది?
33. మొబైల్ నంబర్ (జనగణన సంబంధిత సమాచార పంపిణీ కోసమే)
Read Also: క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు తగ్గించాలి.. కేంద్ర మంత్రికి పురంధేశ్వరి విజ్ఞప్తి
Follow Us On: Sharechat


