కలం, వెబ్ డెస్క్: గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పీజీ (LPG) బుకింగ్ కోసం ఆందోళన అవసరం లేదని, బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ఎల్ పీజీ ఉత్పత్తిని సైతం 25 శాతం పెంచినట్టు తెలిపింది. ఇటీవల దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి మూసేయడం వంటి కారణాలతో గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. సిలిండర్ కోసం ప్యానిక్ అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది.
Read Also: ఆ ఒక్కడు ఎక్కడ? గణపతి పై వీడని సస్పెన్స్!
Follow Us On: Facebook

