కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వాతావరణం భారీ మార్పులకు లోనుకానుంది. వాతావరణ సూచన ప్రకారం (Weather Alert).. రానున్న మూడు, నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. ఆ తర్వాత మాత్రం మార్చి 15 నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. తొలుత ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమై మార్చి 16, 17 తేదీల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. ఈ సమయంలో తెలంగాణ (Telangana) అంతటా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన పిడుగులు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఈ వడగళ్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రైతులు తమ పంటలను కాపాడుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: వెలుగుమట్ల బాధితులకు పట్టాల పంపిణీ
Follow Us On: Facebook

