కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లో వన్ ఆఫ్ ది క్రేజీ మూవీ “హ్యాపీ”(Happy). క్లాసిక్ డైరెక్టర్ కరుణాకరన్( Karunakaran) తెరకెక్కించిన ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన క్యూట్ బ్యూటీ జెనీలీయా (Genelia) హీరోయిన్ గా నటించింది. దర్శకుడు కరుణాకరన్ తన స్టైల్ ఆఫ్ ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా హ్యపీ సినిమాను తెరకెక్కించారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ సినిమాకు అద్భుతమైన పాటలు అందించాడు. హ్యాపీ మూవీ సాంగ్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్.
2006 లో విడుదలైన హ్యపీ సినిమా నేటికీ (జనవరి 27) 20 ఏళ్లు పూర్తి చేస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. హ్యాపీ సినిమా నా కెరీర్ లో ఎప్పటికీ మరచిపోని చిత్రంగా నిలిచింది. బ్యూటిఫుల్ విజన్ తో ఈ సినిమాను దర్శకుడు కరుణాకరన్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. వండర్ ఫుల్ కో స్టార్స్ జెనీలీయా, మనోజ్ భాజ్ పేయిలతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించిన యువన్ శంకర్ రాజాకు, అలాగే సాంకేతిక నిపుణులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ.. అల్లు అర్జున్ అప్పటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.


