కలం, వెబ్ డెస్క్ : విజయ్ తలపతి (Vijay Thalapathi) నటించిన జన నాయగన్ (Jananayagan) సినిమాకు ఊహించని షాక్ తగిలింది. మూవీ సెన్సార్ విషయంలో మాద్రాస్ హైకోర్ట్ (Madras High Court) కీలక తీర్పు వెలువరించింది. గతంలో సినిమా రిలీజ్ విషయంలో U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి ఇచ్చి ఆదేశాలను సవాల్ సెన్సార్ బోర్డు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు రిజర్వు చేసిన డివిజన్ బెంచ్ నేడు (మంగళవారం) తీర్పునిచ్చింది.


