epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

హ్యారీ కేన్ కాంట్రాక్ట్‌పై బయర్న్ క్లారిటీ

కలం, స్పోర్ట్స్​ : బయర్న్ మ్యూనిక్‌లో హ్యారీ కేన్ (Harry Kane) భవిష్యత్తుపై చర్చలు అధికారికంగా మొదలయ్యాయి. స్టార్ ఫార్వర్డ్ ఒప్పందాన్ని పొడిగించే అంశంపై క్లబ్ ఇప్పటికే చర్చలు సాగిస్తున్నట్టు స్పష్టమైంది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన బుండెస్‌లీగా ఈవెంట్‌లో బయర్న్ స్పోర్టింగ్ డైరెక్టర్ మ్యాక్స్ ఎబెర్ల్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 2023లో బయర్న్‌లో చేరిన కేన్‌కు ప్రస్తుతం 2027 వరకూ కాంట్రాక్ట్ ఉంది.

ఈ విషయంపై క్లబ్ సీఈవో జాన్ క్రిస్టియన్ డ్రీసెన్ స్పందించాడు. మ్యూనిక్‌లో కేన్ కుటుంబంతో సంతోషంగా స్థిరపడినట్టు చెప్పారు. క్లబ్‌పై అతడికి పూర్తి నమ్మకం ఉందని, అందుకే తొందరపాటు అవసరం లేదని స్పష్టం చేశారు. ట్రోఫీల కోసం చాలాకాలం ఎదురుచూసిన కేన్… 2025లో బయర్న్‌తో బుండెస్‌లీగా గెలిచి తన కెరీర్‌లో కీలక మలుపు తిప్పాడు. ఈ సీజన్‌లో బయర్న్ లీగ్‌లో ఎనిమిది పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. చాంపియన్స్ లీగ్‌లో కూడా రెండో స్థానంలో నిలిచింది.

గత అక్టోబర్‌లోనే జర్మనీలో తన ప్రయాణాన్ని కొనసాగించే ఆలోచన ఉందని కేన్ (Harry Kane) చెప్పాడు. గణాంకాలే అతడి ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. బయర్న్ తరఫున 126 మ్యాచ్‌ల్లో 119 గోల్స్ సాధించిన కేన్… 30 అసిస్టులు కూడా అందించాడు. ఈ సీజన్‌లో 30 మ్యాచ్‌ల్లో 34 గోల్స్ చేసిన కేన్… బుండెస్‌లీగాలో 19 మ్యాచ్‌ల్లో 21 గోల్స్ నమోదు చేశాడు. లెవాండోవ్‌స్కీ నెలకొల్పిన సింగిల్ సీజన్ రికార్డును అందుకునే దిశగా అతడు ముందుకు సాగుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>