ప్రజావాణికి గంగవ్వ.. స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేనా?

క‌లం, వెబ్ డెస్క్‌: యూట్యూబ్ వీడియోల‌తో ఫేమ‌స్ అయ్యి బిగ్‌బాస్ షో వ‌ర‌కు వెళ్లిన గంగ‌వ్వ (Gangavva) అంద‌రికీ సుప‌రిచిత‌మే. సెల‌బ్రెటీల‌తో ఇంట‌ర్వ్యూలు కూడా చేసిన గంగ‌వ్వ‌కు తెలంగాణ‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ రెడ్డి కూడా గంగ‌వ్వ‌ను క‌లిశాడు. కొద్ది రోజులుగా గంగ‌వ్వ సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. తాజాగా సోమ‌వారం జ‌గిత్యాల (Jagtial) క‌లెక్ట‌రేట్‌లో జ‌రుగుతున్న ప్రజావాణిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. మా సమ‌స్య ప‌రిష్క‌రించండి సారూ అంటూ క‌లెక్ట‌ర్‌క‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి ఐకేపీ సెంటర్ మంజూరు చేయాలని ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్‌కు గంగ‌వ్వ‌ వినతిపత్రం ఇచ్చింది.

వడ్లు కొనుగోళ్ల‌కు, వడ్లు ఆరబెట్టుకునేందుకు త‌మ గ్రామ‌స్థుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకొచ్చింది. అలానే పక్క గ్రామానికి చెందిన గుట్ట భూమి విషయంలో తగాదాలు ఏర్పడుతున్నాయని, అందుకే తమ గ్రామానికి ప్ర‌త్యేకంగా ఐకేపీ సెంటర్‌కు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ‌తంలో గంగ‌వ్వ (Gangavva) రేవంత్ రెడ్డిని క‌లిసిన నేప‌థ్యంలో ఆమె స‌మ‌స్య త్వ‌ర‌గానే ప‌రిష్కారం అవుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. మ‌రి అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.

Read Also: గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>