కలం, వెబ్ డెస్క్: ఈవెంట్లు, ఇతర షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు హాజరయ్యే హీరోయిన్స్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల కేరళలో (Kerala) హనీరోజ్ పట్ల ఓ అభిమాని అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌కు (Manju Warrier) చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకుంది. దీంతో అక్కడి యాంకర్ ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పింది. అయితే మంజు అక్క అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ముద్దు పెట్టుకున్నానని సదరు మహిళ బదులిచ్చింది. మంజు మాత్రం సహనంతో వ్యవహరించి మిగతా వారితో సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్
Follow Us On: Pinterest

