కలం, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి చెందిన కార్పొరేట్ పాఠశాలను ప్రారంభించడంపై బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు మీ మనవడు కట్టగలడేమో కానీ, సామాన్య పేద విద్యార్థులు కట్టలేరని రేవంత్ రెడ్డిని నిలదీశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి, పేద బిడ్డలకు సకల సౌకర్యాలతో కూడిన ఉన్నత విద్యను అందించిందని గుర్తుచేశారు. అలాంటి అద్భుతమైన గురుకుల వ్యవస్థను నేడు నిర్వీర్యం చేస్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), చరిత్రలో చరిత్ర హీనుడుగా మిగిలిపోతారంటూ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు.
Read Also: మళ్లీ గడీల పాలన ఎవరూ కోరుకోరు: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

