epaper
Monday, January 26, 2026
spot_img
epaper

‘అందులో సగం ఇవ్వండి మేమేంటో చూపిస్తాం’

కలం, వెబ్ డెస్క్ :  వింటర్ స్పోర్ట్స్‌కు సరైన పెట్టుబడి వస్తే భారత్ ప్రపంచ వేదికపై నిలబడుతుందని  ఐస్ స్కేటింగ్ వెటరన్ విశ్వరాజ్ జడేజా (Vishwaraj Jadeja) విశ్వాసంగా చెబుతున్నాడు. సమ్మర్ స్పోర్ట్స్‌కు కేటాయించే బడ్జెట్‌లో సగం చాలు అని అతడు తెలిపాడు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ (Khelo India Winter Games) 2026 సందర్భంగా గుప్‌హుక్ చెరువు మంచు విస్తీర్ణంలో విశ్వరాజ్ జడేజా కనిపించాడు.

కేవలం పోటీదారుడిగా కాదు. భారత వింటర్ స్పోర్ట్స్ ఆశకు ప్రతీకగా.. లాంగ్ డిస్టెన్స్ ఐస్ స్కేటింగ్‌లో దేశానికి గుర్తింపు తెచ్చాడు. గుజరాత్ రాజవంశంలో పుట్టిన మూడో తరం అథ్లెట్ అయిన విశ్వరాజ్.. క్రీడ అతని జీవితంలో సహజంగా కలిసిపోయింది. తాత మేజర్ ధ్యాన్‌చంద్‌ (Dhyan Chand)తో కలిసి హాకీ ఆడిన అతడు ఆటల వాతావరణంలోనే పెరిగాడు. రోలర్ స్కేటింగ్‌తో మొదలైన విశ్వరాజ్ ప్రయాణం నెదర్లాండ్స్‌లోని ఎలైట్ ఐస్ ట్రైనింగ్ వరకు చేరింది.

65 జాతీయ రికార్డులు, 300కి పైగా జాతీయ అంతర్జాతీయ రేసులు. త్సో మోరిరి (Tso Moriri) సరస్సులో 4,500 మీటర్ల ఎత్తులో 5 కిలోమీటర్ల వేగపు రికార్డు.. ఈ సంఖ్యల వెనుక సంవత్సరాల పట్టుదల దాగి ఉంది. 40 ఏళ్ల వయసులోనూ విశ్వరాజ్ ఆగలేదు. వింటర్ స్పోర్ట్స్‌ను తాత్కాలిక పరిష్కారాలుగా చూడకూడదని..  ఒలింపిక్ లక్ష్యాలతో ముందుకు సాగితేనే మార్పు సాధ్యమని తెలిపాడు. ఖేలో ఇండియా లాంటి వేదికలు ఆ దిశగా బాటలు వేస్తున్నాయని అతడు నమ్ముతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>