కలం, వెబ్‌డెస్క్: ఏపీ మద్యం కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో వైఎస్సార్సీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy).. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ కేసులో విజయసాయి రెడ్డిని ఏ5గా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. సిట్ దర్యాప్తులో మనీలాండరింగ్ వ్యవహారాలు బయటపడడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. గతేడాది మేలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలు నిందితులను విచారించింది. ఇందులో భాగంగా విజయసాయి రెడ్డి గురువారం ఈడీ బృందం ఎదుట హాజరయ్యారు. ఆయన నుంచి ఈడీ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
కాగా, మద్యం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఇందులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అలాగే ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టై, ప్రస్తుతం బెయిల్ మీద బయటికొచ్చారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) విచారణకు హాజరవడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని భావిస్తున్నారు. కాగా, ఈ కేసులో మద్యం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును గత ఎన్నికల్లో వైసీపీ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి నేతలు అంటున్నారు.
Read Also: తగ్గిన బంగారం, వెండి ధరలు!
Follow Us On: Youtube


