కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు (High Court) తుది తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 5న తుది తీర్పు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. 2024లో నిర్వహించిన తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో (Telangana Group 1) అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సింగిల్ బెంచ్ ముందుగా ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. అప్పటి వరకు సింగిల్ బెంచ్ ఆర్డర్లు అమలులోకి రాకుండా, డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అదే డివిజన్ బెంచ్ తుది నిర్ణయం వెలువరించనుంది.
ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ 1 (Telangana Group 1) ర్యాంకర్లకు పోస్టింగ్స్ ఇచ్చేసింది. 563 మంది గ్రూప్-1 ర్యాంకర్లు అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందారు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ర్యాంకర్లు, నియామకాలు, తదితర అంశాలు ఎలా పరిష్కరించబడతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోర్టు తీర్పుతో వారి భవిష్యత్తుపై స్పష్టతకు రానుంది.
Read Also: మేడారం భక్తులకు వాట్సాప్ సేవలు..!
Follow Us On: X(Twitter)


