కలం, వెబ్ డెస్క్: రోజురోజుకూ కొండెక్కిన బంగారం ధరలు (Gold Prices) అనూహ్యంగా గురువారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో (Hyderabad) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.1,56,600 ఉండగా.. గురువారం ఉదయం రూ.2,290 తగ్గి 1,54,310కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ. 1,43,550 ఉండగా.. గురువారం ఉదయం రూ.2,100 తగ్గి రూ.1,41,450 కి చేరుకుంది. మరోవైపు వెండి (Silver) ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర బుధవారం రూ.3,45,000 ఉండగా రూ.5000 తగ్గి ప్రస్తుతం రూ.3,40,000గా ఉంది.
Read Also: మేడారం భక్తులకు వాట్సాప్ సేవలు..!
Follow Us On: Sharechat


