epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

వెటరన్​ జర్నలిస్ట్​​, ‘వాయిస్​ ఆఫ్​ ఇండియా’ మార్క్​ టుల్లీ కన్నుమూత

కలం, వెబ్​డెస్క్​: ప్రముఖ జర్నలిస్ట్​, రచయిత, బీబీసీ ‘వాయిస్​ ఆఫ్​ ఇండియా’గా పేరు పొందిన మార్క్​ టుల్లీ(90) కన్నుమూశారు (Mark Tully). వృద్ధాప్య సమస్యలతో వారం కిందట ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీలో దాదాపు 30 ఏళ్లు పనిచేసిన ఆయన అనేక రచనలు సైతం చేశారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్​ పురస్కారాలు పొందారు.

మత ప్రబోధకునిగా మారాలనుకొని..

పశ్చిమ బెంగాల్​లోని టోలీగాంగ్​లో 1935లో బ్రిటిష్​ దంపతులకు జన్మించిన మార్క్​ టుల్లీ (Mark Tully) కి భారతదేశమంటే అమితమైన ప్రేమ, అభిమానం. కోల్​కతాలో ప్రాథమిక విద్య అనంతరం మత ప్రబోధకుడిగా మారాలనుకొని యూకేలోని లింకన్​ థియోలాజికల్​ కాలేజీలో చేరారు. అయితే, ఇండియాకు తిరిగి వచ్చాక 1964లో బీబీసీ న్యూఢిల్లీ కరస్పాండెంట్​గా జర్నలిజం ప్రస్థానం ప్రారంభించారు.

బీబీసీ రేడియోలో ‘సమ్​థింగ్​ అండర్​స్టుడ్​’ కార్యక్రమం యాంకర్​గా ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. అలాగే, భారత్​పై రూపొందించిన అనేక డాక్యుమెంటరీల్లో భాగమయ్యారు. 1969లో వివాదాస్పద ‘ఫాంటమ్​ ఇండియా’ డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో యూకేకు వెళ్లిపోయారు. తిరిగి 1971లో ఇండియాకు వచ్చారు. అనంతరం బీబీసీలో సౌత్ ఏషియా విభాగానికి చీఫ్​ బ్యూరోగా పనిచేశారు.

భారత్​లో జరిగిన అనేక విప్లవాత్మక, సంచలనాత్మక సంఘటనలను రిపోర్ట్​ చేశారు. బంగ్లాదేశ్​ విముక్తి పోరాటం, ఎమర్జెన్సీ, పాకిస్థాన్​ మాజీ ప్రధాని జుల్ఫీకర్​ భుట్టోకు ఉరి, సిక్కు అలర్లు, రాజీవ్​ గాంధీ హత్య, బాబ్రీ మసీదు విధ్వంసం, భోపాల్​ గ్యాస్​ ట్రాజెడీ వంటి వాటిని రిపోర్ట్​ చేశారు.
పది పుస్తకాలు రాశారు. ఇందులో ‘నో పుల్​ స్టాప్స్​ ఇన్​ ఇండియా’, ‘ఇండియా ఇన్​ స్లో మోషన్​’, ‘ది హార్ట్​ ఆఫ్​ ఇండియా’ ముఖ్యమైనవి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>