కలం వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ (Padma Shri) అవార్డులను ప్రకటించింది. కర్ణాటకకు కూడా అత్యున్నత పద్మశ్రీ అవార్డు దక్కింది. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని హరలహల్లి గ్రామానికి చెందిన అంకెగౌడకు (Anke Gowda) సాహిత్యం, విద్యకు చేసిన విశేష కృషికిగాను పద్మశ్రీ అవార్డు లభించింది. “అక్షర యోగి”గా ప్రసిద్ధి చెందిన అంకెగౌడ నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. అంకెగౌడ మాజీ KSRTC ఉద్యోగి. సాధారణ జీవితం. సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలను సేకరించడం, భద్రపర్చడం చేసేవాడు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన అంకెగౌడ చిన్న వయసులోనే చదవడం పట్ల ఆసక్తి.
వ్యక్తిగత సౌకర్యాల కోసం పైసా ఖర్చుపెట్టడు. తాను పొందే పెన్షన్‌తో పుస్తకాలను సేకరించేవాడు. వందలు కాదు… వేలు కాదు.. లక్షల్లో పుస్తకాలు సేకరించేవాడు. ఇప్పటి వరకు ఇది 10 లక్షలకుపైగా పుస్తకాలు, మ్యాగజైన్స్‌తో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశాడు. అతని ఇల్లు ప్రసిద్ధ ‘పుస్తక మానే’గా మారింది. ఈ లైబ్రరీలో కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తమిళం, అనేక ఇతర భాషల్లో అరుదైన ప్రచురణలు ఉన్నాయి. అలాగే దశాబ్దాల నాటి వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, విలువైన లిఖిత ప్రతులను కూడా ఉన్నాయి. వీటిని అంకెగౌడ (Anke Gowda) ఇప్పటికీ జాగ్రత్తగా నిర్వహిస్తున్నాడు.
కేవలం కర్ణాటక నుంచే కాకుండా దేశ విదేశాల విద్యార్థులు, పరిశోధకులు విలువైన సమచారం కోసం ఈ లైబ్రరీని తప్పక సందర్శిస్తున్నారు. ప్రభుత్వ నిధులు అందకపోయినా అంకెగౌడ మాత్రం తన సొంత డబ్బులతోనే లైబ్రరీని నడుపుతున్నాడు. వ్యక్తిగత స్థలాన్ని కూడా త్యాగంచేసి ఎంతోమందికి విలువైన పాఠాలను అందిస్తున్నాడు. అంకెగౌడ అందించిన సేవలకు గతంలో కర్ణాటక (Karnataka) రాజ్యోత్సవ అవార్డుతో సహా అనేక గుర్తింపులు లభించాయి. కేంద్రం 2026 పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో అంకెగౌడ మరోసారి వెలుగులోకి వచ్చాడు. యువతరంలో పఠన అలవాట్లను ప్రోత్సహించడమే తన ఏకైక లక్ష్యం అంటున్నాడీయన.
Read Also: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Follow Us On : WhatsApp


