కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో పెళ్లి కాని యువకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు వధువు దొరక్క చాలా గ్రామాల్లో పెళ్లికాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఈ సమస్యను తీర్చడానికి చిత్తూరు (Chittoor) జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామస్తులు ఓ ఉపాయం ఆలోచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన పశువుల పండుగలో.. ఆ గ్రామంలో పెళ్లికాని యువకుల ఫొటోలు, వివరాలతో బ్యానర్ ను కట్టారు. తమ ఊరిలో యువకులకు ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నా కూడా పెళ్లి కావట్లేదని గ్రామస్తులు తెలిపారు. పండుగకు ఇతర గ్రామాల నుంచి వచ్చే వారికి తమ ఊరి యువకుల గురించి తెలిస్తే పెళ్లి సంబంధాలు వస్తాయేమో అనే ఉద్దేశంతోనే ఇలా బ్యానర్ ను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.


