కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి మల్కాపూర్ అటవీ ప్రాంతంలో చిరుతల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాళ్ల గుండ్లపై చిరుతలు కనబడడంతో పొలాలకు వెళ్లే వారు జంకుతున్నారు. ఏ మార్గంలో వచ్చి అవి దాడిచేస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బోన్లలో బంధించి పట్టుకెళ్లాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఈ గుట్టపై గతంలో చిరుతలు చాలాసార్లు కనిపించాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


