కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం సింగరేణి (Singareni) పరిస్థితి బాగోలేదని, లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కాపాడుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెం పద్మావతీ ఖని 5వ ఇంక్లైన్‌లో సింగరేణి కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో బొగ్గు ద్వారా 74 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, జీవో శాతం ప్రమాదాలు లేని బొగ్గు ఉత్పత్తే లక్ష్యమన్నారు.
సింగరేణిలో దుబారా ఖర్చు తగ్గించాలని, నాణ్యతతో కూడిన ఉత్పత్తి పెంచాలని కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి సమస్యలు, పనితీరు ఢిల్లీ బోర్డు మీటింగ్‌లో చర్చించుకోవడం కాదు, కార్మికులకు ప్రతి విషయం తెలియాలన్నారు. ఈ ఏడాది కూడా బొగ్గు దిగుమతి తగ్గిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.


