కలం వెబ్ డెస్క్ : శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు శుభవార్త చెప్పారు. వచ్చే మార్చి నెలాఖరు నుంచి అన్ని టీటీడీ ఆలయాల్లో రెండు పూటలా అన్నప్రసాద(Anna Prasadam) వితరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం టీటీడీ ఈవో ఛాంబర్‌లో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని టీటీడీ ఆలయాల్లో రెండు పూటలు అన్న ప్రసాద వితరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలు నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా గౌహతి, పాట్నా, కోయంబత్తూరు, బెల్గాంలో శ్రీవారి ఆలయాలకు స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


