Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండ జిల్లాలో మిర్చి దొంగతనం

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా పరకాల మండలం మల్లక్కపేట నాగారం గ్రామ శివారులో కల్లంలో ఆరబెట్టిన మిర్చిని(Chilli) గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. మల్లక్కపేట (Mallakkapeta) గ్రామానికి చెందిన దొమ్మటి బాబు అనే రైతు.. పొలంలోని బావి వద్ద సుమారు ఐదు క్వింటాళ్ల మిర్చిని ఆరబెట్టాడు. మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ ఉండడంతో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆ మిర్చిని దొంగతనం చేశారు. ఉదయం పొలానికి వెళ్లిన రైతు మిర్చి కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. అపహరణకు గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: సీఎం రేవంత్ సమక్షంలో.. 130 మంది మావోయిస్టులు సరెండర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>