Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌లో అగ్ని ప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

కలం, వరంగల్ బ్యూరో: ఎండాకాలంలో ప్రారంభంకావడంతో తరుచుగా అగ్ని ప్రమాదాలు (Fire Accident) జరుగుతున్నాయి. శనివారం వరంగల్ (Warangal) నగరంలోని జేపీఎన్ రోడ్‌లో ఉన్న దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షాప్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫర్నిచర్ సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>