Mobile Popup Ad
Mobile Popup Ad

శబరిమల గోల్డ్​ స్కామ్​.. మూడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

కలం, వెబ్​డెస్క్​: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం చోరీ కేసులో (Sabarimala Gold Scam) ​ఈడీ దూకుడు పెంచింది. మంగళవారం ఒకేసారి కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 21 చోట్ల సోదాలకు దిగింది. ప్రివెన్షన్​ ఆఫ్​ మనీలాండరింగ్​ యాక్ట్ ​(PMLA) కింద ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ​(ED) ఈ తనిఖీలు చేస్తోంది. దేవాలయ బంగారం వ్యవహారంలో అవకతవకలు, అడ్మినిస్ట్రేషన్​ లోపాలు, సరైన ఆడిటింగ్​ పత్రాలు లేకపోవడం వంటివి మనీలాండరింగ్​కు దారి తీసినట్లు ఈడీ అనుమానిస్తోంది.

ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్​ పొట్టి, ట్రావెన్​కోర్​ దేవస్వమ్​ బోర్డ్​(టీబీటీ) చైర్మన్​ పద్మకుమార్​తోపాటు ఇతర నిందితులైన మురారి బాబు, వాసు, బంగారు వ్యాపారి గోవర్ధన్​, పంకజ్​ బండారిల ఇళ్లు, అనుబంధ ప్రాంతాలతోపాటు తిరువనంతపురంలోని టీడీబీ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జరుపుతోంది.

కాగా, శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయంలో గర్బగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకులకు సంబంధించిన బంగారు తాపడాలకు మరమ్మతుల పేర్లతో నిందితులు బంగారాన్ని స్వాహా చేయడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటపడడంతో కేసు నమోదు అయ్యింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ప్రధాన నిందితునితోపాటు, ఆలయ పూజారి, మరో 21 మందిని సిట్​ అరెస్ట్​ చేసింది.

Read Also: రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>