కలం, వెబ్ డెస్క్ : దావోస్ (Davos)లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజున బిజీ బిజీగా గడిపింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్ లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు.
ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్ టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఎరో స్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.


