కలం, వెబ్ డెస్క్: నాంపల్లి(Nampally) అగ్నిప్రమాద ఘటనలో 18 గంటల సుధీర్ఘ ప్రయత్నం అనంతరం రెస్క్యూ టీం(Rescue team) సెల్లార్‌లోకి చేరుకుంది. ఈ క్రమంలో సెల్లార్‌లో మూడు మృత దేహాలను గుర్తించారు. సదరు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇందులో ఒక మృతదేహం మంటల్లో చిక్కుకున్న బేబీ అనే మహిళగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. రెస్క్యూ టీం గుర్తించిన మృతదేహాలు ఎవరివి అన్నది తెలియాల్సి ఉంది. 200 మంది సిబ్బందితో రెస్య్కూ కొనసాగుతోంది.


