కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తోంది. నిజామాబాద్ లో పోటీపై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆశావహులతో హైదరాబాద్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 20 నుంచి 30 మంది అభ్యర్థులను బరిలోకి దించేందుకు చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో జాగృతి బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుతో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జాగృతిని రాజకీయ పార్టీగా మార్చడానికి ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు కవిత సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.


