Mobile Popup Ad
Mobile Popup Ad

హైకోర్టుకు నలుగురు పర్మినెంట్ జడ్జీలు.. కొలీజియం సిఫారసు…

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హైకోర్టు(Telangana High Court)కు నలుగురు పర్మినెంట్ జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం ఏప్రిల్ 14న సమావేశమై ఈ మేరకు ఖరారు చేసింది. మొత్తం నలుగురిలో ఇద్దరు మహిళా జడ్జీలు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న ఈ నలుగురినీ రెగ్యులర్ (పర్మినెంట్) జడ్జీలుగా నియమించాలని ఫైనల్ చేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నది. రాష్ట్రపతి అప్రూవల్ చేయడంతో అధికారికంగా గెజిట్ జారీ కానున్నది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ తిరుమలదేవి, జస్టిస్ బీఆర్ మధుసూధన్‌రావు అదనపు జడ్జీలుగా కొనసాగుతున్నారు. వీరినే పర్మినెంట్ జడ్జీలుగా చేయాలని కోలీజియం నిర్ణయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>