కరీంనగర్ కలెక్టర్‌ను కలిసిన నూతన తహసీల్దార్‌ నిఖిలా రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన శ్నిఖిలా రెడ్డి శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూల మొక్కను అందజేయగా, కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్‌గా పని చేస్తున్న నిఖిలా రెడ్డి, ఇటీవల కల్పించిన పదోన్నతుల్లో తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>