కలం, వరంగల్ బ్యూరో: మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా వాట్సాప్ సేవలను (WhatsApp Services) అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 76589 12300 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే జాతరకు సంబంధించిన పూర్తి వివరాలు పొందవచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానఘట్టాలు తదితర సమాచారం నేరుగా వాట్సాప్‌లో లభించనుంది. ఈ సేవలతో భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది. మేడారం జాతర (Medaram Jatara) వెళ్లే ప్రతి ఒక్కరూ వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: తగ్గిన బంగారం, వెండి ధరలు!
Follow Us On : WhatsApp


