epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

ఒక్క కార్డుతో బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా చేస్తున్న ఆలోచనకు తొలి అడుగులు పడ్డాయి. రైల్వే శాఖ, ఆర్టీసీ (RTC – MMTS), ట్రాఫిక్ పోలీసు విభాగాల మధ్య సమావేశంలో లోతుగానే చర్చ జరిగింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సులు, రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్ళకు జాయింట్‌గా ఒకే కార్డు సిస్టమ్‌ను అమలు చేయడంపై కసరత్తు మొదలైంది. కామన్ మొబిలిటీ కార్డు పేరుతో జారీచేసే ఈ కార్డుతో అటు ఎంఎంటీఎస్ రైళ్ళలో, ఇటు ఆర్టీసీ సిటీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి నగర ప్రజలకు వెసులుబాటు కలగనున్నది. ఇందుకోసం రైల్వే స్టేషన్లకు ఆర్టీసీ సిటీ బస్సుల కనెక్టివిటీ పెంచడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడంపై రెండు శాఖల అధికారుల అభిప్రాయాలను, ఆచరణాత్మక ఇబ్బందులను రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలుసుకున్నారు.

రైల్వే స్టేషన్లకు సిటీ బస్ కనెక్టివిటీ :

కామన్ మొబిలిటీ కార్డు విస్తృతంగా వినియోగంలోకి రావడానికి రైల్వే స్టేషన్లకు సిటీ బస్సుల కనెక్టివిటీని పెంచడం చాలా అవసరమన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇందుకోసం ఎక్కువగా ఏయే స్టేషన్ల ద్వారా ఎంఎంటీఎస్ రైళ్ళలో ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారో రైల్వే అధికారులు గణాంకాలను స్పెషల్ సీఎస్‌కు అందజేశారు. ఎంఎంటీఎస్ రైలు సర్వీసుల్లో ఏయే ప్రాంతాల మధ్య ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటున్నదో, ఎలాంటి సమయాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారో కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆ సమయాల్లో ఆ స్టేషన్లకు సిటీ బస్సులను అందుబాటులో ఉంచినట్లయితే ప్రైవేటు వాహనాలు రోడ్లమీదకు రావడం తగ్గిపోతుందని, ఫలితంగా ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవడం ద్వారా సిటీ రోడ్లమీద ట్రాఫిక సమస్యలకు కూడా చెక్ పెట్టినట్లవుతుందని ఈ సమావేశంలో అధికారులు చర్చించుకున్నారు.

పెరగనున్న సిటీబస్ ట్రిప్పుల సంఖ్య :

ఎంఎంటీఎస్ రైళ్ళ ద్వారా ప్రయాణించే సమయానికి అనుగుణంగా ‘ఇన్ అండ్ అవుట్’ ప్యాసింజర్స్ సంఖ్యకు తగినట్లుగా సిటీబస్ ట్రిప్పుల ఫ్రీక్వెన్సీని పెంచడంపై జరిగిన చర్చకు ఆర్టీసీ అధికారుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ చర్చల అనంతరం సుమారు 50 ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీ బస్సుల (RTC – MMTS) కనెక్టివిటీని పెంచడం, అనుసంధానం చేయాలన్న ప్రాథమిక నిర్ణయం జరిగింది. సిటీ బస్ కనెక్టివిటీ లేని కారణంగానే చాలా సందర్భాల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల్ని ప్రజలు వాడడంలేదని, అనివార్యంగా బైక్ లేదా ప్రైవేటు వాహనాలను వాడాల్సి వస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. ఎంఎంటీఎస్ స్టేషన్ల దగ్గర తగిన విధంగా బస్ షెల్టర్లను కొత్తగా ఏర్పాటు చేయడం, రహదారులను విస్తరించడం, మెరుగుపర్చడం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్ తయారుచేస్తే దానికి అనుగుణంగా విధాన నిర్ణయం తీసుకుని కామన్ మొబిలిటీ కార్డు వ్యవస్థను విస్తృతంగా వినియోగంలోకి తేవచ్చని ట్రాన్స్ పోర్టు స్పెషల్ సీఎస్ అభిప్రాయపడ్డారు. త్వరలో మరో సమావేశం జరగనున్నది.

Read Also: హైదరాబాద్​లో జీసీసీ ఏర్పాటుకు యూనిలీవర్ పరిశీలన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>