కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో అసలేం జరుగుతోంది..? మొన్న కుక్కలు.. ఈసారి కోతుల (Monkeys) వంతు.. 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన దారుణం చోటుచేసుకుంది.. కామారెడ్డి (Kamareddy) జిల్లా భిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులోకి వచ్చే ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో కోతులు చడీ చప్పుడు లేకుండా పడి ఉన్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పశు వైద్యుడు అనిల్ రెడ్డి, సిబ్బంది అజీజ్ అక్కడికి చేరుకుని కోతులకు వైద్యం చేశారు. కోతులకు మత్తు మందు ఇచ్చారని గుర్తించారు. మృతువుతో పోరాడుతున్న 35 వానరాలకు వైద్యం చేసి రక్షించారు. ఈ ఘటనలో 10 కోతులకు పైగా మృత్యువాత పడ్డాయి.
అంతంపల్లి గ్రామ సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కోతుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే కామారెడ్డి జిల్లా మాచారెడ్ది మండలంలోని పలు గ్రామాల్లో కుక్కలు చనిపోయి సర్పంచ్‌లపై కేసులు నమోదైన ఘటన మరువక ముందే ఇప్పుడు కోతుల మృత్యువాత కలకలం రేపుతోంది. కోతులకు ఎవరు మత్తు మందు ఇచ్చారు? వాటి మృతికి కారణమెవరు..? అనే విషయాలు తేల్చాల్సిన అవసరం ఉంది. కుక్కల అంశం దృష్టిలో పెట్టుకొని కేసుల భయంతో అలా ఎవరైనా రహస్యంగా కోతులపై విష ప్రయోగం చేశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
Read Also: కేంద్రం కీలక నిర్ణయం.. చట్టసభలకు ఇకపై ర్యాంకింగ్స్
Follow Us On: Instagram


