Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్, డీజిల్ కొరతపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ (Petrol Diesel) నిల్వలు సమృద్దిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ కలిపి మొత్తం 24 వేల కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నామని వివరించారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేలకు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు వివరించారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..

పెట్రోల్, డీజిల్ (Petrol Diesel) సరఫరా, గ్యాస్ ను ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. అలాంటి ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకుంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఏపీలో చమురు కొరత వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

Read Also: భయంకరమైన ఎల్ నినో.. మళ్లీ రాబోతుందా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>