కలం, వెబ్‌డెస్క్: హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారానికి ఒక ఆధ్యాత్మిక కోణం, శాస్త్రీయ కారణం ఉంటుంది. వాటిలో ఒకటి ఈశాన్య దిశలో నీటి చెంబును ఉంచడం. చాలా మంది తమ ఇంట్లోని ఈశాన్య దిక్కులో రాగి లేదా ఇత్తడి చెంబులో నీరు ఉంచుతారు. అసలు ఈశాన్యంలో నీళ్ల చెంబు ఎందుకు ఉండాలి? అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు (Vastu Tips) ఏమంటున్నారో తెలుసుకుందాం.
ధన ప్రాప్తి, ఐశ్వర్యం
ఈశాన్య దిశ “జల తత్వానికి” (Water Element) ప్రతీక అని చెబుతున్నారు పండితులు. ఈ మూలలో నీటిని ఉంచడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రవాహం పెరుగుతుందని నమ్ముతారు.
సహజమైన ప్రశాంతత
ఈశాన్యం నుండి వచ్చే సానుకూల శక్తులు (Positive Vibrations) నీటి ద్వారా ఇల్లంతా వ్యాపిస్తాయట. ఇది ఇంట్లోని సభ్యుల మధ్య మనశ్శాంతిని, సామరస్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
నకారాత్మక శక్తి నిర్మూలన
ఈశాన్య దిక్కులో రాగి పాత్రలో నీరు ఉంచడం వలన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని (Negative Energy) లాగేసుకుని, వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని చెబుతున్నారు.
ఆరోగ్య వృద్ధి
వాస్తు ప్రకారం ఈశాన్యంలో జల వనరు, రాగి లేదా ఇత్తడి చెంబులో నీరు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
అయితే ఆధునిక అపార్ట్‌మెంట్ సంస్కృతిలో, విశాలమైన స్థలం లేకపోయినా, ఈశాన్యంలో నీటి చెంబును ఉంచడం ద్వారా ఈ వాస్తు ప్రయోజనాలను (Vastu Tips) పొందవచ్చని సూచించారు పండితులు. ఈ వివరణలు ఆధ్యాత్మికంగానే కాకుండా, శాస్త్రీయంగానూ పర్యావరణ స్పృహను తెలియజేస్తాయని చెబుతున్నారు. నీటిని వృథా చేయకుండా సంరక్షించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సమయాన్ని, నీటిని వృథా చేస్తే జీవితం నిష్ఫలమవుతుందని హితవు పలికారు.
Read Also: పిల్లల్లో రక్తహీనతను ఎలా గుర్తించాలి?..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే
Follow Us On: X(Twitter)

