కలం, వెబ్ డెస్క్: మెగా డీఎస్సీ (MEGA DSC)లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తామని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)కు సవాల్ విసిరారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజమైన జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు.
జగన్ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, అందుకే ఆయనకు ఆ ప్రక్రియపై అవగాహన లేదని లోకేశ్ (Nara Lokesh) ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ రౌడీల పార్టీ అని, గూండాలు, ఫ్యాక్షనిస్టుల పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే నిజాలు తెలుస్తాయని, ప్రిజనరీకి, విజనరీకి చాలా తేడా ఉంటుందని ఎద్దేవా చేశారు. జగన్ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని విమర్శించారు.
ఇక మాజీ మంత్రి అమర్‌నాథ్ వ్యవహారంపై లోకేశ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పరిశ్రమలకు, గుడ్డుకు తేడా తెలియని వారు వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేశారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాక పోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారని ఆరోపించారు. ప్రస్తుతం దేశానికి రూ.100 కోట్ల పెట్టుబడులు వస్తే అందులో రూ. 20 కోట్లే ఏపీకే వస్తున్నాయన్నారు. హోంమంత్రి అనితపై అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు దారుణమని లోకేశ్ ఖండించారు. జగన్ భార్యా, కుమార్తెలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇలాగే సమర్థించుకుంటారా అని ప్రశ్నించారు.
Read Also: హైదరాబాద్‌లో టెస్లా.. ఏఐ స్పెషల్ కార్లు
Follow Us On: Instagram

