కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో (Tamil Nadu) ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తన ప్రసంగం చదవకుండానే వాకౌట్ చేశారు. గవర్నర్ సభలో ప్రసంగించడానికి వచ్చినప్పటికీ, తమిళ గీతం తర్వాత జాతీయ గీతం కూడా వినిపించాలని కోరారు. స్పీకర్ అప్పావు తిరస్కరించడంతో గవర్నర్ ప్రారంభ ప్రసంగం ఇవ్వకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇలా జరగడం మూడోసారి.
2024, 2025లో కూడా గవర్నర్ (Governor RN Ravi) ప్రసంగం ఇవ్వలేదు. తమిళనాడులో దళితులపై దౌర్జన్యాలు, దళిత మహిళలపై లైంగిక హింస తీవ్రంగా పెరుగుతోంది. అయితే ఈ విషయాలను ప్రసంగంలో చేర్చలేదు. అలాగే జాతీయ గీతం ఆలపించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ ప్రసంగించకుండానే అసెంబ్లీని వీడటం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

Read Also: బొట్టు పెట్టుకున్నాడని స్టూడెంట్ పై వివక్ష
Follow Us On: Sharechat


