కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని బోరబండలో (Borabanda) దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. రొడ్డె ఆంజనేయులు తన భార్య సరస్వతి(32)తో కలిసి బోరబండలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా ఆంజనేయులు తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని గొడవపడుతున్నాడు.
ఈ వ్యవహారంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశంతో ఆంజనేయులు రోకలిబండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సరస్వతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆంజనేయులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే..
Follow Us On : WhatsApp


