కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో వీధి కుక్కల దాడులు (Street Dogs Attack) కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలపై కుక్కులు విచక్షణా రహితంగా దాడులు చేస్తున్న ఘటనలు అనేకం జరగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఖైరతాబాద్ లో వీధి కుక్కలు ఓ చిన్నారిని కరిచాయి.
ఈ దాడీలో యూకేజీ చదువుతున్న పాక శార్వీకి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడితో ముఖంపై తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు బాలికను బంజారాహిల్స్ లోని రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


