కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వీధి కుక్కలను చంపుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల (Mancherial) జిల్లా, ఇతర ప్రాంతాల్లో వీధి కుక్కలను విష ప్రయోగం చేసి చంపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 7, 8 తేదీల్లో కిష్టాపూర్ గ్రామంలో దాదాపు 100 వీధి కుక్కలు చంపబడ్డాయని జంతు సంక్షేమ కార్యకర్త గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా సర్పంచ్‌పై జన్నారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో వీధి కుక్కల (Stray Dogs) సమస్యను పరిష్కరిస్తామని కొందరు హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చేక్రమంలో కుక్కలను చంపుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

