కలం, డెస్క్ : కడప జిల్లాలో కత్తులతో చెడ్డీ గ్యాంగ్(Cheddi Gang) హల్‌చల్ చేసింది. మహారాష్ట్రకు చెందిన చెడ్డీగ్యాంగ్ రాత్రి పూట కత్తులతో హల్ చల్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు వెంబడించడంతో రాళ్లు రువ్వి పారిపోయేందుకు ప్రయత్నించారు దుండగులు. ఇంకో వైపు ఎర్రముక్కపల్లిలో నాలుగు చోట్ల చోరీ చేశారు. ఈ ఘటనతో కడప జిల్లా ఉలిక్కిపడింది. చాలా రోజుల తర్వాత జిల్లాలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేయడంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ను (Cheddi Gang) త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


