Mobile Popup Ad
Mobile Popup Ad

పాత కక్షతో బంధువుకి కరెంట్​ షాక్.. నిందితుడి అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో : పాత కక్షతో ఉద్దేశపూర్వకంగా జీ.ఐ వైర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి బంధువును చంపిన ఘటనలో నిందితుడి పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. రామాయంపేట సీఐ వెంకట రాజు గౌడ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మేడ్చల్ మండలం అత్వెల్లి గ్రామానికి చెందిన దండ శ్యాంసుందర్ రెడ్డి (45) పెళ్లి కోసం నార్సింగి (Narsingi) లో భార్య బంధువుల ఇంటికి వచ్చాడు. పక్క ఇంటి యజమాని తమ్మారెడ్డి భూపాల్ రెడ్డికి ఇంటి యజమాని నాగరాణితో పాత కక్షలు ఉండటంతో, ఉద్దేశపూర్వకంగా గోడపై జీ.ఐ వైర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. ఆదివారం ఉదయం శ్యాంసుందర్ రెడ్డి ఆ వైర్‌పై బట్టలు ఆరబెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి స్పాట్‌లోనే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నార్సింగి (Narsingi) పోలీసులు భూపాల్ రెడ్డిని శనివారం అరెస్టు చేసి విచారించచగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వెంకటరాజు గౌడ్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>