కలం, నిజామాబాద్ బ్యూరో : మేడారం జాతర (Medaram Jatara) కు వెళ్ళే నిజామాబాద్ (Nizamabad) జిల్లా భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మేడారం కోసం చరిత్రలో తొలిసారి నిజామాబాద్ నుంచి రైళ్లు నడపనుంది. నిజామాబాద్ నుంచి మేడారం జాతరకు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు ప్రకటించారు. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో రైలు నంబరు 07499 నిజామాబాద్ నుంచి బయలు దేరి వరంగల్ (Warangal) కు వెళ్తుంది. రైలు నంబరు 07500 వరంగల్ నుంచి బయలు దేరి నిజామాబాద్ వరకు వస్తుంది.. ఇలా రోజూ అప్ అండ్ డౌన్ నాలుగు ట్రిప్పులు నడుస్తాయి.
28 నుంచి 31 తేదీల్లో వరంగల్-నిజామాబాద్ (07500) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కామారెడ్డి, అక్కన్నపేట, మిర్జాపల్లి, వడియారమ్, మనోహరాబాబాద్, మేడ్చల్, బొల్లారం, మౌలాలి, చర్లపల్లి, ఘట్ కేసర్, బీబీనగర్, వంగపల్లి, ఆలేరు, జనగామ, రఘునాథ్ పల్లి, ఘన్పూర్, పెండ్యాల్, కాజీపేటలో హాల్టింగ్ మీదుగా కల్పించారు. ఇక ఆదిలాబాద్ వైపు కూడా రైళ్లు వచ్చాయి. అవి కూడా నిజామాబాద్ మీదుగా ప్రయాణం చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఈ నెల 28న రైలు నంబరు 07501 ఆదిలాబాద్ నుంచి వయా నిజామాబాద్, పెద్దపల్లి మీదుగా కాజీపేట్‌కు, ఈ నెల 29న 07502 నంబరు రైలు కాజీపేట్ నుంచి నిజామాబాద్, పెద్దపల్లి మీదుగా ఆదిలాబాద్‌కు ఒక్కో ట్రిప్పు చొప్పున నడవనుంది.
కాజీపేట-ఆదిలాబాద్ మధ్య అంబరి, కిన్వాట్, ధనోరా దక్కన్, సహస్రకుండ్, హిమాయత్ నగర్, హడ్గాన్లోడ్, బోకర్, ముధ్కెడ్, ఉమ్రి, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, మోర్తాడ్, మెట్పల్లి, కోరుట్ల, లింగంపేట్ జగిత్యాల, గంగాధర, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, కొలనూర్, జమ్మికుంట, ఉప్పల్, హసన్ పర్తిలో హాల్టింగ్ కల్పించారు. ఇలా మేడారం జాతర కోసం నిజామాబాద్ (Nizamabad) నుంచి రైళ్లు కేటాయించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: చెల్లెలు ఆరోపణలకు కేటీఆర్ ఆన్సర్ ఏంటి: పీసీసీ చీఫ్
Follow Us On : WhatsApp


