కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఖండించారు. కాంగ్రెస్ సర్కారు హామీలు అమలు చేయకుండా, అమలుకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలను అక్రమ కేసులు, నోటీసులతో వేధించడంపై సమయం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు సిట్ నోటీసుల పేరుతో నాటకం ఆడుతోందని విమర్శించారు.
పరిపాలన గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు తండ్లాడుతుంటే.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రాన్ని ప్రజల కర్మానికి వదిలేసి దావోస్ అటు నుండి అమెరికా పర్యటనలకు వెళ్తున్నాడని.. ప్రభుత్వ సొమ్ముతో రేవంత్ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుండి వచ్చే వరకు ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియల్ నడిచేలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని నిరంజన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా మారిందన్నారు. రెండేళ్లుగా దర్యాప్తు బృందం కొండనుతవ్వి ఎలుకను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు. అధికారులు మారుతున్నారు కానీ.. ఆధారాలు చూపించడం లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడుతుండం విచారకరమన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖల వెన్ను విరిచారని నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) దుయ్యబట్టారు.
Read Also: మరోసారి ఫామ్‌హౌస్‌కు హరీష్ రావు; కేసీఆర్‌తో కీలక భేటీ
Follow Us On: X(Twitter)


