epaper
Friday, January 30, 2026
spot_img
epaper

కోటిన్నర మొబైల్​ నెంబర్ల ఆటకట్టించిన సంచార్​ సాథీ

కలం, వెబ్​డెస్క్​: సైబర్​ నేరాల నియంత్రణలో ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) యాప్​ అద్భుతంగా పనిచేస్తోందని కేంద్రం వెల్లడించింది. ఈ యాప్​ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కోటిన్నర అనుమానిత మొబైల్​ నెంబర్ల ఆటకట్టించినట్లు వివరించింది. ఈ నెంబర్లను సైబర్​ నేరాలకు వాడుతున్నట్లు గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ పాంచజన్య పత్రిక శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఈ విషయాలు వెల్లడించారు.

27 లక్షల వాట్సాప్​ ఖాతాలు నిలిపివేత​..

దేశంలో డిజిటల్​ వాడకం వేగంగా పెరుగుతుండడంతో సైబర్​ నేరాల నియంత్రణ కోసం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ​(Sanchar Saathi) ను తెచ్చిందని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ యాప్​పై విమర్శలు వచ్చినా.. ప్రజల్లో మాత్రం ఆదరణ ఉందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు సంచార్ సాథీ పోర్టల్​కు 20కోట్లకు పైగా హిట్స్​ వచ్చాయని, 2కోట్లకు పైగా డౌన్​లోడ్స్​ జరిగాయని చెప్పారు.

‘అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 1.52కోట్ల మొబైల్ నెంబర్లను సంచార్ సాథీ యాప్​ బ్లాక్​ చేసింది. వెరిఫికేషన్​ ద్వారా మరో 2 కోట్ల నెంబర్లను డిస్కనెక్ట్​ చేశాం. ఈ నెంబర్లకు అనుంసంధానమైన డిజిటల్​ కమ్యూనికేషన్​ ప్లాట్​ఫాలంలపైనా చర్యలు తీసుకున్నాం. అంతేకాదు, 27లక్షల వాట్సాప్​ అకౌంట్స్​నూ నిలిపివేశాం’ అని కేంద్ర మంత్రి అన్నారు. సైబర్​ మోసాల నుంచి రక్షించే బలమైన ఫైర్​వాల్​లాగా సంచార్​ సాథీ పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు.

రోజుకు 1.35 కోట్ల మోసపూరిత కాల్స్​..

సైబర్​ మోసాల గుర్తింపులో బ్యాక్​ ఎండ్​లో ఇంటిలెజెన్స్​ వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. ఇందులో ఐకోర్​ (ICORE) ముఖ్యమైనదని చెప్పారు. ఇది వివిధ ప్రభుత్వ ఏజెన్సీల డేటాను సమన్వయం చేస్తోందని తెలిపారు. ‘గతంలో విదేశాల నుంచి రోజుకు సుమారు 1.35 కోట్ల మోసపూరిత కాల్స్‌ వచ్చేవి. వీటిని గుర్తించి రాకుండా చేశాం. సంచార్‌ సాథీ యాప్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌, ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాంల సహకారంతో రాష్ట్రాలు, దేశాల మధ్య పనిచేస్తున్న మోసాల నెట్‌వర్క్‌లు గుర్తించాం. ఫలితంగా నకిలీ కాల్స్‌ సంఖ్య దాదాపు 95 శాతం తగ్గింది’ అని జ్యోతిరాదిత్య వెల్లడించారు.

Read Also: జాతరకు వెళ్లేదెలా.. మేడారంకి ఫిట్‌నెస్ లేని బస్సులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>